RRR1-పరిచయం 05.04.2021

RRR1-పరిచయం 05.04.2021


రా.10:23
సిరిమువ్వలు - 01 
ఎవరి కోసమైతే కన్నీరు కారుస్తామో వారిపై 
మనకున్నది ప్రేమ
ఎవరి వలన ఐతే కన్నీరు కారుస్తామో వారు మనకు చేసింది మోసం
ఎవరు ఐతే  మన కన్నీరు తుడుస్తారో వారికి 
మనపై ఉన్నది స్నేహం
ఎవరు ఐతే అసలు మనకు కన్నీరే రానియరో వారే మన ధైర్యం
అలాంటి ధైర్యం మనలోనే పెంచుకోవడం నిజమైన వ్యక్తిత్వం.... శ్రావణసంధ్య

రా. 10:00
పట్టాలు లేకుండా రైలు నడవదు
కష్టాలు లేకుండా జీవితం గడవదు
  ✍️శ్రీకాంత్ సింధె

రా. 9:53
అంశం ;జీవితం మారాలా! ఆలోచన మారాలి !
---------------------------------------
జీవితం విచిత్రమైనది! యవ్వనంలో సమయము -శక్తి ఉంటాయి ,కానీ డబ్బు ఉండదు .
మధ్య వయసులో శక్తి -డబ్బులు ఉంటాయి ,కానీ సమయం ఉండదు! వృద్ధాప్యంలో సమయము- డబ్బున్న కష్టపడే శక్తి ఉండదు! ఏ ప్రయోజనం కోసం మనం జన్మించాము తెలుసుకోవడమే నిజమైన జీవితం!
 జీవితం అనేది పెద్ద గ్రంథం! అందులో కొన్ని పుటలు ఆనందంగా ,సంతోషంగా కొన్ని పుటలు ,బాధగానూ అశాంతిగా ఉండవచ్చు ,కానీ తర్వాత పేజీలో ఏముంటుందో అనే భయంతో పేజీ తిప్పడం మాత్రం మరవకు !
ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పే!
 మొదటిది మనలోని అసమర్ధతను బయటపెడితే రెండవది మనలోని అత్యాశ ని బయట పెడుతుంది!
 ఇతరులకు ఎంతో మందికి తెలియని విషయాలను మనము తెలుసుకోగలగడమే వ్యాపార రాణింపు అసలు రహస్యం !
చావుని కూడా చంపాలంటే నలుగురి కోసం బతికి చూడు! ఓటమిని ఓడించడoఅంటే గెలిచే వరకు పోరాడిచూడు!
 మనం చేసే పాప కార్యాలకు ఎందరో సహకరించవచ్చు, ఆ పాప ఫలితం ఒంటరిగా అనుభవించాలి !
మనశ్శాంతిని కోరుకుంటే ఇతరుల దోషాలను ఎంచకు! జీవితంలో కష్ట-సుఖాలు పగలు రాత్రి ల ఎప్పుడు మీ వెంటే ఉంటాయి!
 ఈ ప్రపంచంలో బతకాలంటే సదా ధైర్యం అనే అస్త్రం మన దగ్గర ఉండాలి !
జీవితంలో వైఫల్యాలు ఉండవు వాటి నుంచి వచ్చిన ఫలితాలు మాత్రమే ఉంటాయి !
దుఃఖాలు ఉండవు కానీ వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఉంటాయి!
 సమస్యలు ఉండవు కానీ ఆ సమస్యల నుండి బయట పడేందుకు ప్రత్యామ్నాయాలు ఉంటాయి !
ప్రతి క్షణం అవకాశాలు ఎదురు చూస్తూ ఉంటాయి వాటిని అందిపుచ్చుకునేవారే తెలివైనవారు!
 ఎన్ని కష్టాలు వచ్చినా చివరి వరకు నిజాయితీగా వ్యవహరించడం అవసరం!
 అవినీతిని ప్రోత్సహించడం సన్మార్గం కాదు !
ఆగ్రహం మనలో ప్రవేశిస్తే ఆలోచన దూరమవుతుంది! ఎదుటివారికి మనం ఇచ్చే సలహా మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది! మనం బడీలో నేర్చుకున్నదంతా మర్చిపోయాక మిగిలేది అసలైన విద్య!
 మనం ఎంత పని చేస్తున్నామ నే దానికంటే ఆ పని ఎలా చేయబోతున్నాం అనేది ముఖ్యం !
మన గురించి మనం గొప్పలు చెప్పే కొద్ది అబద్ధాలు దొర్లు తోనే ఉంటాయి !
మన ప్రమేయం లేకుండా స్పందన కోల్పోయిన మనిషికి హృదయాన్ని మించిన జైలు లేదు !
ఆఖరికి ఒక మాట అగ్ని తలకిందులుగా పట్టుకున్న  జ్వాలలు పైకి ప్రసరిస్తాయి!
 అలాగే కార్యశూరునికి ఎన్ని ఇక్కట్లు కలిగిన అతని ధైర్యం సడలదు !
జీవిత గమ్యం చేరాలంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు!
 జీవితంలో లో జీవించాలంటే ఓరిమి తప్పదు !
జీవితం అందని ద్రాక్ష -అందితే తీయని ఫలం- ఫలితం !
----------------------------------------
ఈ రచన పూర్తిగా నాదే అని అని హామీ ఇస్తున్నాను!
----------------------------------------
 స్వీయరచన ;కవిత దాస్యం
 ఊరు; కోదాడ 
చరవాణి :9440637267.

రా.9:41
జీవితమంటే ఇంతేగా
---------------------------
వయసు పెరుగితే
 జీవిత కాలం తగ్గుతుంది...

అహం పెరిగితే
బంధాలు బలహీనపడతాయి...

వర్తమానం పరిగెడితే
అనుభవాలు  గుణపాఠాలుగా మారుతాయి,

బలమున్నచోట జ్ఞానానికి చోటుండదు,,
జ్ఞానమొచ్చాక గడ్డిపరక కూడా పీకే బలం  ఉండదు..

తరతరాల చరిత్రలు చూసిన
మనసు బుద్ధితో స్నేహం చేయదు..

ఆకులున్నప్పుడు చేతులు కాలుతాయన్న ఆలోచనుండదు..

చేతులు కాలేక ఆకులవసరముండదు..

ఇంకా చెపితే  ఛాదస్తం
పరాకాష్టకు చేరిందంటారు
తీరం కోసం ఆరాటం
బంధాలతో పోరాటం..

తిరిగే కాలచక్రంపై
బ్రతుకు పయనం..
తప్పదు మరి...
ఆశతో వేయాలి అడుగులు..
రేపటిని దర్శించాలంటే
🖋️శ్రీదేవి సురేష్ కుసుమంచి🖋️

రా.9:11
నక్షత్రాల ముచ్చట్లు
నీలి నీలి ఆకాశన 
నిగనిగలాడే నక్షత్రాలు...
చీకటి కమ్మిన రేయ్ లోన 
చిట్టి పొట్టి నక్షత్రాలు...
సల్లని వెన్నెల చెలిమిలోన
సన్నజాజి నక్షత్రాలు...
సంద్రుని స్నేహం కోసం
సయ్యటాలు ఆడే నక్షత్రాలు....
శ్రావణ నక్షత్రం రాఖీ పండగ తెచ్చిందంట...
అన్న చెల్లల సంతోషాన్ని తనివితీరా చూసిందంట..
తెల్లని ఆకాశన కనిపించి కనిపించని 
అరుంధతి నక్షత్రం అయి నిన్ను నన్ను కలిపిందంట
అశ్విని,భరణి,కృత్తిక,రోహిణి
మృగశిర,ఆరుద్ర,ఉత్తర,హస్త
ఒక్కో పండగని తేవాలి అంటు
నక్షత్రాలు ముచ్చట్లేస్తున్నాయి...
అయ్యయ్యో ఇది నక్షత్రాలకి చేరింద చదివేస్తున్నాయి..😁😁(ఆలోచించకండి మీరే)
సుమన చక్రవర్తి

కాళీకాదేవి విగ్రహం అలా ఎందుకు ఉంటుందో తెలిపే కథ

*ఒకసారి శివపార్వతులు కైలాస పర్వతం మీద కూర్చొని ఉన్నారు. శివునితో ఆమె అన్నదట.... "చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా కావాలి." శివుడు జాప్యం చేసాడు. మళ్లీ మూడు నాలుగు సార్లు అడిగిందామె. కాని ఆయన మౌనంగానే ఉండిపోయాడు. ఆమెకి ఆకలి భరించలేనంతగా పెరిగిపోయింది. అమాంతంగా మహాదేవుడినే ఎత్తి పట్టుకుని మింగేసింది. ఆమె శరీరం నుండి ధూమరాశి చిమ్ముకుని బయటకి వచ్చింది. లోపల నుండి శివుడు ఇలా అన్నాడు. పార్వతీ! సుందరమైన నీ తెల్లని దేహాన్ని నన్ను మింగి నల్లని పొగలతో కప్పేసుకున్నావు ఇప్పటినుండి ఈ నీ అవతారం ధూమ్ర లేక ధూమావతి అని ప్రసిద్ది కెక్కుతుంది అని చెప్తాడు శంకరుడు.*

*వందలకొలది నక్కలు అరిచినట్లుగా అరిచే ఉగ్రచండికను తన దేహం నుండి పార్వతి ఉత్పత్తి చేసింది. ఆమెను శివదూతగా ఉపయోగించింది. ఈమెకి ఎవరూ పురుషుని స్వామ్యత్వం లేదని చెప్పడానికే శివుణ్ణి ఆమె మింగేసిన్దని ఉగ్గడించడంలోని భావం. ఆమె అంగ భూతాలైన నక్కలు, అసురుల పచ్చిమాంసంతో తృప్తి చెందాయి. ఇదే దేవికి ఆకలి వేసినది అనడంలోని రహస్యం. సప్తసతిలోని ఎనిమిదవ అధ్యాయంలో  ఈ వ్యాఖ్యానం దొరుకుతుంది.*

*ధూమావతి, బగళా, తారా, కాళీ దేవతలు ఘొర కర్మలకై ఉపయుక్తులౌతారని చెప్తారు. ఈమె ధ్యానమూర్తి. వివర్ణ, చంచలా, నల్లని దేహం కలిగి మురికి గుడ్డలు చుట్టుకుని ఉంటుంది. విరబోసుకున్న జుట్టు, కోపిష్టి, విధవ కాకధ్వజం కల రధంమీద కూర్చోడం, చేతిలో చేట, ఆకలిదప్పులతో వ్యాకుల పడుతూ ఉండటం ఇవి ఈమె లక్షణాలు.*

*నిర్మలమైన కళ్లు కలిగిన దేవిగా పిప్పలాద మహర్షి ఈమెని దర్శించిన ఉపాసకుడు. విపత్తి నాశనం, రోగనాశనం కలగడానికి, యుద్దంలో విజయం పొందడానికి, ఉచ్చాటన, మారణ క్రియలకూ, భూత ప్రేత ప్రయోగాలకు ఉపయోగించే దేవత. "మహాపది, మహాఘోరే, మహారోగే, మహారణే, శత్రూచ్ఛాటనే, మారాణాదౌ జాంతూనామ్మోహనే తధా".*

*ఈమె ఉపాసకుల మీద దుష్టాభిచార ప్రభావాలు ఉండవు.*

*ధూమావతి పేలకుండా ఉన్న చీకటి పేలిన తరువాత సూర్యబింబం. సుఖంలోని మాధుర్యంవైపు మన మనస్సులను ఈడ్చుకొనిపొయే విరూప మోహిని ధూమావతి. ఈమె నిత్యానంద ప్రదాయిని. సంసార జంబాలంలో చిక్కుకున్న వాళ్ళ పాలిట ధూమావతి అవిద్యయే కాదు, దుఖదాయిని కూడా. లలితా సహస్రనామాలలో విద్యాయై నమః ప్రక్కనే అవిద్యాయై నమః అని కూడా ఉంది.*
        
*ఆవరణ శక్తి, విక్షేప శక్తి అని మాయలో రెండు భేదాలు ఉన్నాయి. ఉన్నదాన్ని ఆవరించుకొని లేనట్లుగా చూపేది ఆవరణ శక్తి. లేనిదాన్ని ఉన్నట్లుగా ప్రదర్శించి భ్రమింపచేసేది విక్షేప శక్తి. ధూమావతి ఈ రెండు పనులనూ చేస్తుంది. మనజీవితాలలో కాంతిమయమైనది మధ్యదశ ఒక్కటే. పుట్టుకకు ముందు చావుకు పిదప అంతా అవ్యక్తమే. ఈ అవ్యక్త దశే ధూమావతి. దైహిక వ్యాపారాలలోని సౌఖ్యాన్ని మోహాన్ని ఆనందాన్ని అసత్యమనుకున్న మరుక్షణమే దేహాతీత భావాతీత శూన్యత్వం మనముందు ధూమావతిగా ప్రత్యక్షం అవుతుంది.*

*వృద్దకాళియే ధూమావతి, కాలానికి కాలాతీత తత్వానికి, ప్రాణానికి ప్రాణాతీత అనుభవానికి, వ్యక్తానికి ప్రతిబింబమైన అవ్యక్తానికి అగ్నిలక్షణ దౌహృదమైన ధూమావతి ప్రతీక. హృదయంలోని దహరాకాశం ధూమావతికి నివాస స్థానం. కాని ఎక్కడా స్థిరపడి ఉండకుండా అంతటా వ్యాపించి తిరగటమే ఆమె స్వభావం.*

*చేట, తట్ట మనం సుఖాలనుకునే భావాలను చెరిగి జల్లించి యధార్ధాన్ని నిరూపించే ప్రయత్నానికి ప్రతీకలు. వికార రూపానికి ఒక సుందర రూపం దాగి ఉన్నదని చేసే బోధ మాంత్రికురాలి ఆకారం కల ధూమావతి మంత్రోద్దిష్ట నిరూపణం. ఈమె శివుడు లేని నిఖార్సైన శక్తితత్వం. పిప్పలాదుడు అధర్వవేదాన్ని ప్రశ్నోపనిషత్తును దర్శించి సృష్టించిన మహర్షి. ఆయన ఈ మహావిద్యకు ద్రష్ట. ఈ వ్యాసం  రచన కోసం మాత్రమే ప్రచురించడమైనది.

పసుపులేటి నరేంద్రస్వామి 

✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️


 -------------------
 మహానీయుని మాట
        ------------------------
అసత్యంతో సాధించిన విజయం కంటే సత్యంతో సాధించిన పరాజయం మేలు.

        -------------------
 నేటీ మంచి మాట
      ---------------------------
ఇతరులకు సాధ్యమైతే సహాయం చేయండి. అలా కుదరకపోతే కనీసం హాని చేయకుండా ఉండండి.







No comments:

Post a Comment

100/100

  100/100 చదువుల దేశం అక్కడ ఏ పిల్లాడూ బడికెళ్లనని మారాం చేయడు. ఏ చిన్నారీ భుజాన పుస్తకాల సంచీతో ఆపసోపాలు పడుతూ కనిపించదు. యూనిఫాంలూ, హోం వర...